![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -186 లో.. నర్మద, ప్రేమ ఇద్దరు డ్యాన్స్ క్లాస్ ముగించుకొని ఇంటికొస్తారు. ఇక అప్పటికే విషయం తెలుసుకున్న రామరాజు ఫుల్ కోపం మీద ఉంటాడు. మామయ్యా అంటూ ప్రేమ ఏదో చెప్పబోతుంటే..వద్దూ .. ఏం చెప్పొద్దని రామరాజు ఆపేస్తాడు. మీరిద్దరూ ఒకరికొకరు చేసుకునే సపోర్ట్ అద్భుతం, అమోఘం. మీరు బాగా చదువుకున్నారు కాబట్టి.. తెలివితేటలు ఉండటం సహజం అనుకున్నా.. కానీ మీ ఇద్దరిలో ఎదుటి వాళ్లని పిచ్చోళ్లను చేసే తెలివితేటలు ఉన్నాయని నాకు తెలియలేదంటూ ఫుల్ ఫైర్ అవుతాడు.
ఏమైందండీ అని రామరాజుని వేదవతి అడుగుతుంది. ఒకసారి చేస్తే పొరపాటు.. కానీ రెండోసారి కూడా అదే తప్పు చేస్తే లెక్కలేనితనం.. వీళ్ల దృష్టిలో నేనంటే అదే అని రామరాజు అంటాడు. ఏం జరిగిందని అడుగుతుంటే.. ఏదేదో మాట్లాడతారేంటని వేదవతి అంటుంది. ఏం చెప్పను.. ఏమని చెప్పను.. ఈ ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్లు చేస్తున్నారు. ఈ ఇంటికో పెద్ద ఉన్నాడూ.. ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదనే అహంకారంతో ఉన్నారని చెప్పనా అని రామరాజు అంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని వేదవతి అడుగగా.. ఇదిగో వీళ్ళిద్దరి గురించేనని రామరాజు అంటాడు. వీళ్ళేం చేశారని వేదవతి అనగా.. అంటే ఈ విషయం నీక్కూడా తెలియదన్న మాట. ఇద్దరూ కలిసి నన్నే కాదు.. నిన్ను కూడా పిచ్చిదాన్ని చేశారన్నమాట. ఈ అమ్మాయి ఏం చేసి వస్తుందో తెలుసా.. బయట ఎక్కడో ఎవరింట్లోనో డాన్స్ క్లాస్ చెప్పి వస్తుందని రామరాజు అంటాడు. ఆ మాటతో ఇంట్లో వాళ్లంతా షాక్ అయిపోతారు. ఆ ఉద్యోగం చూసింది ఎవరో తెలుసా.. ఇదిగో ఈవిడ గారే అంటూ నర్మదని చూపిస్తాడు రామరాజు.
నీ డ్యాన్స్ వల్ల మీ వాళ్లు నన్ను నలుగురిలో అవమానిస్తున్నారు.. మీ వాళ్లు నన్ను అవమానించి.. నలుగురిలో నా పరువు తీయాలనుకుంటున్నావా అని ప్రేమతో రామరాజు అనగానే.. నేను మీ ఇంటి కోడల్ని.. మీ పరువు నిలబెట్టాలనే అనుకుంటాను తప్ప.. మీ పరువు తీయాలని ఎందుకు చూస్తాను. అలాంటి పని చేయనని ప్రేమ అంటుంది. హా.. మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి.. నాకు తెలియకుండా వెళ్లి డాన్స్ క్లాస్ చెప్పి వస్తున్నావంటే.. నన్ను అవమానించాలనే కదా అని రామరాజు అంటాడు. ఇక ప్రేమ, నర్మదలని రామరాజు ఇష్టం వచ్చినట్టు తిడతాడు. భార్య భాద్యత భర్తది, భర్తే సంపాదించాలని క్లాస్ పీకుతాడు రామరాజు. వేదవతి సపోర్ట్ చేసినా రామరాజు వినిపించుకోకుండా ప్రేమని డ్యాన్స్ క్లాస్ చెప్పొదంటాడు. నర్మద వల్లే ఇదంతా తన వల్లే ఇంట్లో ఇన్ని గొడవలని రామరాజు అనగానే తను ఫీల్ అవుతుంది. ఇక ఇదంతా చూసి శ్రీవల్లి తెగ సంబరపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |